Balakrishna: బాలయ్య అంటే డ్యూయల్‌ రోల్‌ ఉండాల్సిందేనా…

ఒక బాలకృష్ణను తెర మీద చూస్తేనే అభిమానులు ఉర్రూతలూగిపోతారు. అయితే ఆయనతో సినిమాలు చేసే దర్శకులు అభిమానులకు ఎప్పుడు డబుల్‌ ధమాకా ఇవ్వాలనే చూస్తుంటారు. గోపీచంద్‌ మలినేని కూడా ఇదే ఆలోచన చేస్తున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య డబుల్‌ రోల్‌లో కనిపిస్తాడని టాక్‌. ప్రస్తుతం బాలయ్య… ‘అఖండ’ సినిమా పనుల్లో బిజీగాఉన్నారు. గోపీచంద్‌ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా త్వరలో మొదలవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి కీలకమైన పాయింట్‌ ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ డబుల్‌ రోల్‌. కొత్త సినిమాలో బాలయ్య సాధారణ గెటప్‌ ఒకటి ఉండగా… మరొకటి డిఫరెంట్‌ గెటప్‌ అంటున్నారు. ఈ సినిమాలో ఎప్పటిలాగే బాలయ్య ఒక ఏజ్డ్‌ గెటప్‌ ఉంటుందట. అది స్వామీజీ గెటప్‌ అని అంటున్నారు. ఇప్పటికే ‘అఖండ’లో ఇంచుమించు అలాంటి గెటప్‌లోనే బాలయ్య కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఆ లుక్‌ బయటకు వచ్చింది. ఇప్పుడు గోపీచంద్‌ ఇంకెంత కొత్తగా చూపించబోతున్నాడు అనేదే ఇక్కడ విషం. ఇలాంటి గెటప్‌లలో బోయపాటి శ్రీను దిట్ట. ఆ జోరు గోపీచంద్‌ కూడా చూపించాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus