సల్మాన్ ఖాన్ తర్వాత జగపతి బాబు బాలీవుడ్‌లో ఏ హీరోతో నటిస్తున్నాడంటే..!

జగపతి బాబు.. ప్రముఖ దర్శక నిర్మాత.. జగపతి పిక్చర్స్ అధినేత.. వి.బి. రాజేంద్ర ప్రసాద్ నట వారసుడిగా 1974లో ‘మంచి మనుషులు’ (శోభన్ బాబు) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. 1989లో ‘సింహ స్వప్నం’ తో హీరోగా పరిచయమయ్యారు.. ముఖ్యమైన క్యారెక్టర్లలో నటిస్తూ.. ‘నటభూషణ’ శోభన్ బాబు తర్వాత ఇద్దరు హీరోయిన్లతో నటించే ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు..33 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారాయన.. పడి లేచిన కెరటం లాంటి జగ్గూ భాయ్ జీవితం కొంతమందికి ఆదర్శం..

ముక్కుసూటి తనం, దాన గుణం ఆయన స్వభావం.. జల్సాల కారణంగా ఎలాంటి నష్టాలు వచ్చాయి.. జీవితం ఎలాంటి గుణ పాఠాలు నేర్పింది అనేది పలు ఇంటర్వూల్లో చెప్పారు.. నటుడిగా కెరీర్ స్టార్ట్ అయిన కొత్తలో నీ గొంతు బాగోలేదనే కామెంట్స్ నుండి పలు చిత్రాలకు వాయిస్ ఓవర్‌తో పాటు.. హాలీవుడ్ ‘లయన్ కింగ్’ మూవీలో స్కార్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పే వరకు రావడం విశేషం..ఇక కనుమరుగైపోయిన జగపతి బాబుని జూలు విదిల్చిన సింహంలా చేసింది ‘లెజెండ్’ మూవీ.. ఆయన విలన్ ఏంటని ఆశ్చర్యపోయారంతా.. కట్ చేస్తే.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో, జితేంద్ర పాత్రలో గర్జించారు..

తర్వాత జగ్గూ భాయ్ కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది.. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్లతో నటించి మెప్పించారు.. తమిళ్, కన్నడ, మలయాళంలోనూ టాప్ స్టార్లతో విలన్‌గా నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.. వెబ్ సిరీసుల్లోనూ ఆకట్టుకున్నారు..ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు.. ఆయణ్ణి ఇక నుండి పాన్ ఇండియా యాక్టర్‌గా పిలవొచ్చు..

ఎందుకంటే ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కన్ఫర్మ్ చేశారు.. ఆయుష్ శర్మ హీరోగా.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధా మోహన్ హిందీ పరిశ్రమకు నిర్మాతగా పరిచయమవుతూ.. కాత్యాయన్ శివ్‌పురి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో జగ్గూ భాయ్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. #AS04 వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ మూవీతో మరోసారి బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా మెప్పించనున్నారు ప్రైమ్ స్టార్ నుండి పాన్ ఇండియా యాక్టర్‌గా మారిన జగ్గూ భాయ్..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus