Bigg Boss 5 Telugu: వరెస్ట్ పెర్ఫామర్ అని తేల్చేశారు..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం ఒక వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ వీక్ లో ఈవిషయంపై జెస్సీ జైల్ కి వెళ్లాడు. ఆ తర్వాత మానస్, సన్నీలు కూడా జైల్లో ఒకరోజు గడిపారు. అయితే, నాలుగోవారం మరోసారి హౌస్ మేట్స్ అందరూ కలిసి జెస్సీని జైల్ కి పంపారు. వరెస్ట్ పెర్ఫామర్ అని హౌస్ లో మెజారిటీ ఓట్లు జెస్సీకి రావడం అనేది ఇది రెండోసారి.

నిజానికి కెప్టెన్ గా జెస్సీ సెలక్ట్ అయినపుడు హౌస్ మేట్స్ అందరూ చాలా లైట్ తీస్కున్నారు. తను చెప్తున్నా కూడా ఎవరూ వినిపించుకోలేదు. హౌస్ మేట్స్ కో ఆపరేషన్ లేనిదే ఖచ్చితంగా కెప్టెన్సీ చేయలేం. హౌస్ కి కెప్టెన్ అవ్వాలని క్యూరియాసిటీతో జెస్సీ కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. స్విమింగ్ పూల్ లో తన సత్తాని చాటి కెప్టెన్ అయ్యాడు. కానీ, హౌస్ మేట్స్ నిద్రపోవడం, రూల్స్ ని అతిక్రమించడం, బిగ్ బాస్ కమాండ్స్ ని పాటించకపోవడం చేయడంతో జెస్సీ అశక్తుడు అయ్యాడు. హౌస్ మేట్స్ ని నియంత్రించడంలో విఫలం అయ్యాడు. ఇదే రీజన్ చెప్పి హౌస్ మేట్స్ లో కొంతమంది జెస్సీని ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ గా ఎంచుకున్నారు.

జెస్సీతో పాటుగా లోబోకి కూడా ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ కెప్టెన్ శ్రీరామ్ చంద్రని నిర్ణయం తీస్కోమని చెప్పాడు. శ్రీరామ్ చంద్ర లోబో పేరు చెప్పి, ఆ తర్వాత హౌస్ మేట్స్ మెజారిటీ ఆప్షన్ ని కూడా తీస్కున్నాడు. హౌస్ మేట్స్ అందరూ మరోసారి జెస్సీకి ఎక్కువ ఓట్లు వేయడంతో జెస్సీ జైల్ కి వెళ్లక తప్పలేదు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus