Karan Johar: మొన్న సమంత.. ఇప్పుడు కరీనా.. ఒకేలాంటి సమస్య!

బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ అంటే ఇష్టపడని నటులు చాలా తక్కువమంది ఉంటారు. ఎంతోమంది వారసత్వ నటులకు, కొత్త నటులకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మంచి స్టార్‌ హోదా వచ్చే వరకు సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే అతనిని ఇష్టపడని వాళ్లు చెప్పే విషయమూ అదే. వారసత్వాన్ని ఎక్కువగా నమ్ముకుంటారని, దాని వల్ల కొత్తవాళ్లు అవకాశాలు రావని అంటూ ఉంటారు. తనను ట్రోల్‌ చేసేవారి గురించి కరణ్‌ కూడా ఓపెన్‌గా మాట్లాడుతుంటాడు.

అయితే ఇప్పుడు అతనిని ట్రోల్‌ చేయడానికి అతనే మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. కాఫీ విత్‌ కరణ్‌ అంటూ ఆరు సీజన్లను రన్‌ చేసిన… టీవీ నుండి ఓటీటీకి ఆ షోను తీసుకొచ్చారు. ఓటీటీలో సెన్సార్‌ సమస్యలు లేకపోవంతో కరణ్‌ ప్రశ్నల్లో బోల్డ్‌నెస్‌ పెంచాడు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే దానికి తోడు కరణ్‌ కన్‌ఫ్యూజన్ (?) తోడై షోకి వచ్చినవారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నెలకొంది. కావాలని చేస్తున్నాడో, లేదంటే వాళ్లను ఇరిటేట్‌ చేయాలని చేస్తున్నాడో తెలియదు కానీ పాత బంధాలను గుర్తు చేసి షాక్‌ చేస్తున్నాడు కరణ్‌.

మొన్నీ మధ్య సమంతతో మాట్లాడుతూ నాగచైతన్యను భర్త అంటూ సంబోధించిన కరణ్‌.. ఇటీవల కరీనా కపూర్‌తో మాట్లాడుతూ షాహిద్‌ కపూర్‌ను మాజీ భర్త అని అన్నాడు. తొలి సందర్భంలో సమంత చాలా కూల్‌గా ‘ఎక్స్‌ హజ్బెండ్‌’ అని చెప్పగా కరణ్‌ సర్దిచెప్పుకుని మాటలు కంటిన్యూ చేశాడు. ఇప్పుడు కరీనాతో ‘మాజీ భర్త అని అని, వెంటనే కవర్‌ చేసుకొని మాజీ లవర్‌’ అని అన్నాడు కరణ్‌. దీంతో అతని మీద విమర్శలు మొదలయ్యాయి.

సమంత ఎపిసోడ్‌లో నయనతార గురించి అభిమానులు హర్ట్‌ అయ్యేలా కరణ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఏకంగా కరణ్‌ ‘నా ఉద్దేశం అది కాదు’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ‘మాజీ’ రచ్చ మొదలైంది. మరోసారి కరణ్‌ సారీ చెబుతాడేమో చూడాలి. అయితే ఈ షో లైవ్‌ కాదు.. కాబట్టి కరణ్‌ తన మాటల్ని ఎడిట్‌ చేసి వదలొచ్చు. కానీ అలా చేయకుండా ఆ మాటల్ని అలానే ఉంచేస్తున్నాడు. దీంతో ఇదంతా కావాలనే ప్రచారం కోసం చేస్తున్నారు అని అనుకోవచ్చు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus