ఎన్టీఆర్ 30 తో పాటు మహేష్ 30 కూడా.. కొరటాలతోనే..!

అదేంటో కానీ మహేష్ – ఎన్టీఆర్ లకు ఈ మధ్య ఒకేలా జరుగుతుంది. అదెలా అంటారా.. ఎన్టీఆర్ 24 వ సినిమాకి ముందు వరకు ఫ్లాపులు ఫేస్ చేశాడు. మహేష్ కూడా తన 24 వ సినిమాకి ముందు వరకు ఫ్లోపుల్లో ఉన్నాడు.ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. అది ఎన్టీఆర్ కు 24 వ చిత్రం. ఇక మహేష్ కు 24వ చిత్రం భరత్ అనే నేను. ఈ మూవీతో అతను కంబ్యాక్ ఇచ్చాడు.

ఇక వీరి 25వ సినిమాల్లో సీఈఓ గా చేశారు. 26వ సినిమా ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పైగా ఆ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 27వ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఫెయిల్యూర్స్ మాత్రం కాలేదు. ఇక 28 వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

29 వ సినిమాని ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో (ఆర్.ఆర్.ఆర్) చేశాడు.. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన 29వ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక్కడి వరకు ఏదో అలా కుదిరింది అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ తన 30 వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. మహేష్ బాబు కూడా తన 30 వ చిత్రాన్ని కొరటాల శివతోనే చేయబోతున్నాడు అనేది తాజా సమాచారం.

అవును మైత్రి వారి నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ తర్వాత అడ్వాన్స్ తీసుకున్నాడు. కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తో సినిమా అయ్యాక మైత్రి వారితో ఓ సినిమా చేయాలి. మహేష్ కు కూడా కొరటాలతో సినిమా చేయడానికి ఇష్టపడతాడు. సో ఈ కాంబోని మైత్రి వారు ఫిక్స్ చేసినట్టు సమాచారం.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus