అల్లు అర్జున్ (Allu Arjun) పై మెగా అభిమానుల్లో చాలా వ్యతిరేకత నెలకొంది. ‘చెప్పను బ్రదర్’ అనే డైలాగ్ వాడటం వల్ల ‘డీజె’ (Duvvada Jagannadham) ‘నా పేరు సూర్య’ (Naa Peru Surya) సినిమాల రిలీజ్ టైంలో బన్నీ పై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమాల ఫలితాలు కూడా ఆ ట్రోలింగ్ కి మైలేజ్ ఇచ్చినట్టు అయ్యింది. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ (Trivikram) తో ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టి ఆ ట్రోలింగ్ నుండి ఎస్కేప్ అయ్యాడు బన్నీ. ఆ తర్వాత పరోక్షంగా మెగా హీరోల పై తన పైత్యం చూపించుకున్నా..మెగా అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మెగా అభిమానులను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను గట్టిగా కెలికేశాడు బన్నీ.
ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు అల్లు అర్జున్.. చాలా స్ట్రాటజీలు ప్లే చేశాడు. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి బెస్ట్ విషెస్ చెబుతూ…. ‘మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలి’ అంటూ జస్ట్ ఓ ట్వీట్ వేసి సరిపెట్టిన బన్నీ.. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున బరిలోకి దిగిన శిల్పా రవిచంద్ర తరఫున ప్రచారం చేశాడు. ఇది మెగా అభిమానులను, పవన్ అభిమానులను మాత్రమే కాదు.. ‘జనసేన’ ని అభిమానించే వారందరికీ చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
అయితే ఇప్పుడు ఏమైంది? శిల్పా రవిచంద్ర ఓడిపోయారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గెలిచారు. ‘శిల్పా ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేదు.. నాకు స్నేహితుడు కాబట్టి సపోర్ట్ చేశాను’ అంటూ బన్నీ సర్ది చెప్పినా..? ‘మరి కుటుంబ సభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఎందుకు బెస్ట్ విషెస్ చెప్పలేదు.. ప్రచారంలో పాల్గొన లేదు?’ అంటూ ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు.
బహుశా ‘మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని బన్నీ అనుకున్నాడేమో..! ‘పుష్ప’ (Pushpa) సినిమాకి తక్కువ టికెట్ రేట్లు ఉండటం వల్ల ఆ సినిమా ఆంధ్రాలో సరిగ్గా కలెక్ట్ చేయలేదు. అందుకే ‘ ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) టికెట్ రేట్ల హైక్ విషయంలో అలాంటి ఇబ్బంది పడకూడదు’ అని భావించి శిల్పా రవిచంద్ర తరఫున బన్నీ ప్రచారం చేసి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఫేవర్ అడుగుదాం అని బన్నీ భావించి ఉంటాడు’ అనే అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి.. బన్నీ ‘పుష్ప 2 ‘ కి ఇబ్బందులు వస్తాయా? అనే ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతుంది. ఒకవేళ ‘టీడీపీ .. ‘పుష్ప 2 ‘ టికెట్ హైక్స్ కి అనుమతి ఇవ్వకపోతే.. బన్నీ ఏ మొహం పెట్టుకుని పవన్ వద్దకు వెళ్లి సాయం కోరతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సరే ‘పవన్, చంద్రబాబు సినీ పరిశ్రమని ఇబ్బంది పెట్టే పనులు చేయరు’ అనుకుందాం.! మరి పవన్, చరణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది. అలాగే ఆంధ్రాలో ‘జనసేన’ ని అభిమానించే వారు బన్నీ సినిమాలు చూస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానం ఆగస్టు 15 వరకు తెలియదు.