మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు తెలిసిన వాళ్లకు చిన్న కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇప్పటికే చిరంజీవి ఎంతోమందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు. చిరంజీవి నటుడిగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోసారి చిరంజీవి మంచి మనస్సును చాటుకోగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభుకు హార్ట్ లో 80 శాతం బ్లాకులు ఉన్నాయని తెలియగా ఆయన చికిత్సకు సంబంధించి సెకండ్ ఒపీనియన్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్టార్ హాస్పిటల్ కు సమాచారం ఇచ్చి ప్రభు చికిత్సకు అయిన మొత్తం ఖర్చును భరించారు. ప్రస్తుతం ప్రభు క్షేమంగానే ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసిన ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక లేఖను రిలీజ్ చేసింది. వైద్యులు స్టంట్స్ తో ప్రభు ప్రాణాలను కాపాడారని భోగట్టా. మొదట వైద్య పరీక్షలు చేసిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి బైపాస్ చేయాలని సూచించారని తెలుస్తోంది.
ప్రభు ఆస్పత్రి బిల్లు చెల్లిస్తానని చెప్పినా చిరంజీవి మాత్రం వద్దని వారించి బిల్లు చెల్లించినట్టు సమాచారం. చిరంజీవి రీల్ హీరో మాత్రమే కాదని రియల్ హీరో కూడా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర (Vishwambhara) రిలీజ్ కు ఏడు నెలల సమయం ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోంది. మెగా ఫ్యాన్స్ ను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమా ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.