బిగ్ బాస్4: మోనాల్ మళ్ళీ అదే స్కెచ్ వేస్తుందిగా…!

‘బిగ్ బాస్4’ మొదలవ్వడమే ఎక్కువగా మోనాల్ పై మీమ్స్ రావడం మొదలయ్యాయి. మొదట్లో ఈమె అయినదానికీ కానీ దానికి ఓ ఏడుస్తుండడంతో.. ఈమెను కూడా పాతాళగంగ అన్నట్టు ట్రోల్ చేసేవారు. హౌస్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఆమె ఇదే తీరుతో ఉండేది కానీ.. అఖిల్ మరియు అభిజీత్ లతో మాత్రం ఘాటు రొమాన్స్ చేసేది. రాత్రి టైములో అభిజిత్ తో అలాగే డే టైంలో అఖిల్ తో ఈమె ఎక్కువగా మాట్లాడుతూ… హగ్గులు, ముద్దులు వంటి వాటితో రెచ్చిపోతూ ఉండేది. అందుకే ఈమెను ‘ప్రేమ దేశం’ సినిమాలో టబు అంటూ కామెంట్లు చేసేవారు నెటిజన్లు.

అయితే అటు తరువాత అభిజిత్ కు దూరంగా ఉంటూ అఖిల్ తో క్లోజ్ గా మూవ్ అయ్యేది. అంతేకాదు ఇక ‘వీరిద్దరూ హౌస్లో నుండీ బయటకి వెళ్లడమే పెళ్లి చేసేసుకుంటారు పక్కా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేవారు మన నెటిజన్లు. ఏకంగా మోనాల్ వల్ల అఖిల్.. అభిజీత్ తో మాటల యుద్దానికి దిగడం కూడా ఓ సెన్సేషన్ అయ్యింది. అయితే ఇటీవల అఖిల్ కు మోనాల్ కు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది.

‘నీకంటే కూడా నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్’ అంటూ అఖిల్.. మోనాల్ తో అనడంతో ఆమె హర్ట్ అయ్యింది. ఈ టైములో అభిజీత్ ను కూడా ఆమె నామినేషన్స్ నుండీ సేఫ్ చెయ్యడం జరిగింది. దీనిని బట్టి మళ్ళీ అభిజీత్.. మోనాల్ తో క్లోజ్ అవుతున్నాడు. అలా అని మోనాల్.. అఖిల్ ను పక్కన పెట్టడం లేదు. మళ్ళీ ‘ప్రేమదేశం’ ఫార్మేట్ నే మొదలుపెట్టింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus