తెలుగు హీరోలతో తమిళ దర్శకులు చేసిన సినిమాలు ఎక్కువ శాతం ఫ్లాప్ అయ్యాయి. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. తమిళ దర్శకులు తెలుగు హీరోలతో చేసిన సినిమాల్లో… మన హీరోలను తక్కువ చేసి చూపిస్తారు అనే కంప్లైంట్ కూడా ఉంది. తమిళంలో మిడ్ రేంజ్ లేదా యంగ్ హీరోలని విలన్ రోల్స్ కి తీసుకుని.. వాళ్ళతో హీరోలను డామినేట్ చేయించడం వంటివి చేస్తుంటారు అనేది చాలా మంది తెలుగు ప్రేక్షకుల కంప్లైంట్.
‘స్పైడర్’ ‘ది వారియర్’ ‘కస్టడీ’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో ఇదే జరిగింది. అందుకే తెలుగు హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
నాగార్జున ఆల్రెడీ ఇద్దరు తమిళ దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పారట. మరోపక్క నాగ చైతన్య కూడా తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అవును ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ ఫాంటసీ మూవీ చేస్తున్న నాగ చైతన్య… ఆ తర్వాత శివ నిర్వాణ లేదా చందూ మొండేటి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా పి.ఎస్.మిత్రన్ కి ఛాన్స్ ఇచ్చాడట. ‘అభిమన్యుడు’ ‘సర్దార్’ ‘హీరో’ వంటి సినిమాలతో పి.ఎస్.మిత్రన్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అతని సినిమాల్లో సోషల్ మెసేజ్ ఉంటుంది. నాగ చైతన్యకి కూడా అతను అలాంటి కథే చెప్పి ఒప్పించినట్టు టాక్.