నితిన్.. పవన్ కళ్యాణ్..కు వీరాభిమాని. కెరీర్ స్టార్టింగ్ నుండి నితిన్ తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమాల రిఫరెన్సులు వాడుతూనే ఉన్నాడు. అయితే నితిన్ వరుసగా ప్లాపుల్లో ఉన్న టైంలో… తనతో పెద్ద దర్శకులు, నిర్మాతలు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే.. సొంత బ్యానర్లో ‘ఇష్క్’ అనే సినిమా చేశాడు. ఇది నితిన్ కి ఆల్మోస్ట్ ఫైనల్ ఛాన్స్ వంటిది ఆ టైంలో. ఈ సినిమాని పుష్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆడియో రిలీజ్ కి వెళ్లడం.
ఆ తర్వాత పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడం, సినిమాపై బజ్ పెరగడం జరిగింది. ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది. నితిన్ ఆ తర్వాత పికప్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు.. మార్కెట్ పెరిగింది. ఇప్పటికీ నితిన్ పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు వాడతాడు.. కానీ ఎక్కువ భజన చేయడం లేదు.
ఇప్పుడు ‘మొగలిరేకులు’ సీరియల్ హీరో ఆర్.కె.సాగర్ కి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవసరం పడింది. అతను హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏదీ ఆడటం లేదు. అతని లేటెస్ట్ మూవీ ‘ది 100’ రిలీజ్ కి రెడీగా ఉంది. దీని ప్రమోషన్స్ కోసం మెగా ఫ్యామిలీని గట్టిగానే వాడుకున్నాడు సాగర్. ముఖ్యంగా అతను జనసేన పార్టీలో ఉన్నాడు. అందుకే తన ‘ది 100’ సినిమా ట్రైలర్ ని పవన్ తో లాంచ్ చేయించాడు.
ఇక తాజాగా ఈ సినిమా ప్రెస్ షో వేశారు. ఇందులో ‘PK for AK’ అంటూ కొంతమంది షో రన్ అవుతున్న టైంలో సందడి చేశారు. సో నితిన్ ని ఆర్.కె సాగర్ రీప్లేస్ చేసినట్టు అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ‘ది 100’ సినిమా పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ తో థియేటర్లలో ఎంత వరకు ఆడుతుందో..!