ఆఖరి సినిమా కోసం ఫ్లాప్‌ల హీరోయిన్‌ను తీసుకుంటున్నారా?

‘ది గోట్‌’ (The Greatest of All Time) సినిమా పని అయిపోయింది.. ఇప్పుడు ఓటీటీకి కూడా వచ్చేస్తోంది. దీంతో విజయ్‌ (Thalapathy Vijay)  ఫ్యాన్స్‌ చూపులు కొత్త సినిమా వైపునకు వెళ్లాయి. ఎందుకంటే ఆ కొత్త సినిమానే ఆఖరి సినిమా అవ్వొచ్చు అనే పుకార్లు వస్తున్నాయి కాబట్టి. ఈ క్రమంలో సినిమా నుండి వరుస ప్రకటనలు ఉన్నాయి అని టీమ్‌ అనౌన్స్‌ చేసింది. తొలుతగా సినిమా విలన్‌ను ప్రకటించేసింది. నెక్స్ట్‌ హీరోయిన్లను అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. అయితే, ఆ హీరోయిన్లు వీరే అంటూ ఓ పుకారు కోలీవుడ్‌లో, టాలీవుడ్‌లో షికార్లు చేస్తోంది.

Pooja Hegde

విజయ్‌ – హెచ్‌ వినోద్‌ (H Vinoth) కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్‌, ఒక సీనియర్‌ హీరోయిన్‌ను తీసుకునే పనిలో ఉన్నారట. కొత్త నాయిక ‘ప్రేమలు’ (Premalu) మమితా బైజు (Mamitha Baiju) కాగా.. పాత నాయిక పూజా హెగ్డే (Pooja Hegde) అని చెబుతున్నారు. విజయ్‌ – పూజ గతంలో ‘బీస్ట్‌’ (Beast) అనే సినిమా చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయ్‌ తన ఆఖరి సినిమా కోసం ఫ్లాప్‌ హీరోయిన్‌ను తీసుకున్నాడు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు మమితా బైజును తీసుకోవడం వల్ల కొత్త అందం కూడా అందిస్తున్నాడు. తద్వారా బ్యాలెన్స్‌ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక విలన్‌గా బాబీ డియోల్‌ను (Bobby Deol) తీసుకొని కోలీవుడ్‌, బాలీవుడ్‌, మాలీవుడ్‌ను కవర్‌ చేసేశారు సినిమా టీమ్‌ అనే పేరు తెచ్చుకున్నారు. తెలుగు నుండి కూడా ఓ స్టార్‌ నటుడు సినిమాలో నటిస్తాడని టాక్‌. అలాగే ప్రియమణి (Priyamani) కూడా ఓ కీలక పాత్రలో కనిపిచనుందని సమాచారం.

ఇక ఆఖరి సినిమా అని ఎందుకు అంటున్నాం అంటే.. విజ‌య్ ఇటీవల రాజకీయాల్లో అడుగు పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుండే ప్లాన్స్‌ వేస్తున్నారు. అందుకే ఈ సినిమాతో ఆపేసి.. పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాను అక్టోబ‌ర్ 2025లో విడుదల చేయాలని చూస్తున్నారట.

తెలుగు సినిమా అని ఇంగ్లిష్‌ పేరు.. ఎందుకో చెప్పిన శ్రీ విష్ణు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus