మరోసారి ‘మా’ లో గొడవలు షురూ..!

రోజు రోజుకీ ‘మా’ (మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) లో గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం పై ఎంతో మంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి చక్క దిద్దే పని చేస్తున్నా.. వారి పై కూడా మిగిలిన మెంబెర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గతేడాది ‘మా’ ఎన్నికలకి ముందు నిధులని దుర్వినియోగపరుస్తున్నారంటూ పెద్ద చర్చే జరిగింది. పోనీ ఎన్నికలు ముగిసిన తరువాత అయినా అవి సర్దుమణిగాయా అంటే.. కచ్చితంగా దానికి డబుల్ అయ్యాయనే చెప్పాలి. ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ ఆ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచి .. పెద్ద దుమారం రేపాడు.

ఇక ఆ వెంటనే ఆయన రాజీనామా చేయడం కూడా పెద్ద సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ‘మా’ అధ్యకుడు నరేష్ పై క్రమశిక్షణా సంఘానికి కంప్లైంట్ వెళ్లడం కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ‘నరేశ్ ఒంటెద్దు పోకడతో మా పూర్తిగా నష్టపోతోందని .. సభ్యులను పట్టించుకునే పరిస్థితిలో నరేష్ ఇప్పుడు లేరని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మా ప్రధాన కార్యదర్శి జీవిత సైతం ఆ లేఖలో పేర్కొన్నారని సమాచారం. ‘నరేశ్ నిధుల్ని తన సన్నిహితులకు తరలిస్తున్నారని.. వెంటనే ఆయన పై చర్యలు తీసుకోవాలని ఆరోపణలు వ్యక్తం చేశారు. మరి ఈ విషయం పై క్రమశిక్షణ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి..!

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus