Pushpa, RRR: ఇక్కడ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’నే ఫాలో అయ్యారుగా!

టాలీవుడ్‌ హీరో పాన్‌ ఇండియా స్టార్ అవ్వాలంటే… అయితే రాజమౌళి సినిమాలో నటించాలి, లేదంటే రాజమౌళి టీమ్‌ వేసే అడుగుల్లో అడుగులేసుకుంటూ పోవాలి. అల్లు అర్జున్‌ టీమ్‌ ఇప్పుడు రెండో స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది. ఇదంతా ‘పుష్ప’ సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం, రిలీజ్‌ విషయంలో వాడే స్ట్రాటజీలు, ప్లాన్స్‌ను ‘పుష్ప’ టీమ్‌ యాజ్‌ ఇట్‌ ఈజ్‌ వాడుతోంది. మొన్నామధ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ దుబాయిలో ఓ ఈవెంట్ పెట్టాలని చూస్తోందనే వార్తలొచ్చాయి.

దీంతో ‘పుష్ప’ టీమ్‌ కూడా అదే ఆలోచన చేసిందని టాక్‌ వచ్చింది. అయితే ఆ తర్వాత రెండు టీమ్స్‌ నుండి అలాంటి ముచ్చట్లు ఏవీ వినిపించలేదు. ఇదే కాదు సినిమా రిలీజ్‌ విషయంలోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారని టాక్‌. తమిళంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను లైకా వాళ్లు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ కూడా అదే పని చేసింది. ఇదే కాదు… ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్‌ చేయడంలోనూ ‘బాహుబలి’ స్టైల్‌ను ఫాలో అయ్యారు.

సినిమా ప్రచారం విషయంలోనూ చిన్న చిన్న వీడియోలు, పాటలు రిలీజ్‌ చేస్తూ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. గతంలో ‘బాహుబలి’ విషయంలో, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలోనూ ఇదే చూశాం. సినిమాల విడుదల ముందు బాలీవుడ్‌ పీఆర్‌లు, ప్రముఖ రిపోర్టర్లకు రాజమౌళి కంటెంట్‌ ఇస్తుంటారు. ‘పుష్ప’ టీమ్‌ ఇప్పటికే ఆ పని చేసిందని వార్తలొస్తున్నాయి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus