రెండోసారి కనువిందుచేయనున్న మహేష్, రకుల్ జోడి!

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబుతో నటించాలని కలలుకంది. ఆ కల స్పైడర్ సినిమాతో నెరవేరింది. అయితే అది ఆనందాన్ని మిగల్చలేదు. కారణం విజయం సాదించకపోవడమే. వారిద్దరి జోడీ బాగున్నప్పటికీ కథకి ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది. అందుకే రకుల్ కి వెలితిగానే ఉంది. మహేష్ తో కలిసి హిట్ అందుకోవాలని భావించింది. ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరిగింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ గోవాలో మొదలుకానుంది.

ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగా లతో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చారు. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మాత్రం మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.  ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని పరిశీలిస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. సుకుమార్ తో నేనొక్కడినే అనే ప్లాప్ ని మహేష్ అందుకున్నారు. ఇక రకుల్ తో స్పైడర్ అనే అపజయాన్ని చవిచూశారు. వీరిద్దరితో కలిసి ఒకేసారి భారీ హిట్ అందుకోవాలని మహేష్ ప్రయత్నం ఎంతమేర సక్సస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus