రామ్‌చరణ్ – కొరటాల శివ కాంబినేషన్… ఇప్పటివరకు ఈ కాంబో గురించి రెండు సార్లు వార్తలొచ్చాయి. రెండూ సార్లూ ఉసూరుమనిపించారు. తొలిసారి అయితే ఏకంగా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. రెండోసారి అయితే ఫొటో బయటకు రావడంతో పుకార్లు జోరందుకున్నాయి. అయితే రెండోసారి వచ్చిన పుకారు సగం నిజమైంది. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పుకారు వస్తోంది. అంతేకాదు ఈసారి సినిమా షూటింగ్ పట్టాలెక్కడం పక్కా అని కూడా అంటున్నారు. రచయితగా వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ వచ్చిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
మాస్ ఎలిమెంట్స్, మేనరిజమ్స్, కథనంతో సినిమాను అదరగొట్టేశారు. సినిమా ఫలితం చూసి రామ్‌చరణ్ ముందుకొచ్చారు. కొరటాలతో సినిమా ఉంటుందని చెప్పడం, ముహూర్తం పెట్టడం అన్నీ చకచకా అయిపోయాయి. బండ్ల గణేష్ బ్యానర్‌లో ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఏమైందో కానీ ఆ సినిమా ఆగిపోయింది. దాని స్థానంలో ‘గోవిందుడు అందరివాడేలే’ మొదలైంది. ఆ తర్వాత 2017లో మరోసారి ఈ ఇద్దరి కాంబో గురించి చర్చ వచ్చింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంతో కలసి రామ్‌చరణ్ కొరటాల సినిమాలో చేస్తారని అన్నారు. అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు.
అయితే ఈసారి మళ్లీ ఆగింది. కానీ డైరక్టర్.. ఆ కాంపౌండ్ నుండి ఆ సినిమా పట్టుకుని బయటకు రాలేదు. చిరంజీవి హీరోగా సినిమా మొదలుపెట్టారు. అందులో చరణ్ కీలక పాత్రలో నటించారు. కానీ మూడోసారి మళ్లీ ప్రయత్నం సాగుతోందట. అవును కొరటాల, రామ్‌చరణ్ కాంబోలో సినిమా కోసం చర్చలు సాగుతున్నాయట. తారక్ సినిమా తర్వాత కొరటాల చేయబోయే సినిమా రామ్‌చరణ్‌దే అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పనుల్లో కొరటాల బిజీగా ఉన్నారు.
మరోవైపు చరణ్ శంకర్ సినిమాతో బిజీ, ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా ఉంటుంది. ఈ రెండూ పూర్తయ్యే లోపు కొరటాల పూర్తి కథ సిద్ధం చేసుకుంటారని టాక్. అప్పుడు కానిది, ఇప్పుడు అవుతుందేమో చూడాలి. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ మీద రూపొందుతుంది, ఎవరెవరు నిర్మాతలుగా ఉంటారు లాంటి వివరాలు అయితే అందుబాటులో లేవు. మరోవైపు చరణ్ లైనప్‌లో సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. సో వెయిట్ అండ్ సీ.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!