ముచ్చటగా మూడోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రవితేజ

మాస్ మాహారాజ్ రవితేజ ప్రస్తుతం ‘డిస్కో రాజా’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండవ షెడ్యూల్ లోకి అడుగు పెట్టబోతుంది. ఈ చిత్రం చేస్తుండగానే రవితేజ మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తనకి ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

గతంలో గోపీచంద్ మలినేని పై కూడా మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనే నమ్మకం ప్రేక్షకులలో ఉండేది. అయితే సాయి తేజ్ తో తీసిన ‘విన్నర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ కావడంతో… ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి హీరోలు భయపడుతున్నారట. దీంతో… తన మొదటి హీరో అయిన రవితేజ దగ్గరకే తిరిగొచ్చాడని సమాచారం. మరి ఈ చిత్రంతో హిట్టు కొట్టి రవితేజకు హ్యాట్రిక్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus