వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ధనుష్ (Dhanush) . సెన్సిటివ్ కథల్ని సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సిద్ధహస్తుడు. ఈ క్రేజీ కాంబినేషన్లో ‘కుబేర’ (Kubera) సినిమా వస్తుంది. ‘ఏషియన్ సంస్థ’ ‘అమిగోస్’ క్రియేషన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో అక్కినేని నాగార్జున (Nagarjuna) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్ ని వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక సినిమాని జూన్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత శేఖర్ కమ్ముల నుండి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇదిలా ఉండగా.. ‘కుబేర’ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల ..నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇటీవల చర్చనీయాంశం అయ్యింది. దీనికి సమాధానంగా నాని (Nani) పేరు ఎక్కువగా వినిపించింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పట్లో అది పట్టాలెక్కడం కష్టం. ఎందుకంటే మధ్యలో నాని ‘పారడైజ్’ (The Paradise) కంప్లీట్ చేయాలి. అలాగే తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో కూడా ఓ సినిమా అనుకుంటున్నాడు. కాబట్టి.. నాని – శేఖర్ కమ్ముల సినిమా ఇప్పట్లో కష్టమే. అయితే మరోపక్క ధనుష్ కి మరో కథ వినిపించి మరో ప్రాజెక్ట్ కి లాక్ చేసుకున్నాడట శేఖర్ కమ్ముల. దీనిని కూడా ఏషియన్ సంస్థ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.