మరోసారి ఇండైరెక్ట్ గా సెటైర్లు.. మళ్ళీ చర్చనీయాంశం అయ్యాయిగా..!

సమంత గత 10 నెలలుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ రెండు నెలలు వార్తల్లో నిలిచింది. మొత్తానికి తీసేసుకుంది. ఆ తర్వాత ఆమె సెలెక్ట్ చేసుకునే పాత్రలు, నర్తించే పాటలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఇక ఖాళీ టైం లో ఆమె పెట్టె సోషల్ మీడియా పోస్టులు.. పరోక్షంగా ఎవరిపైనో సెటైర్లు వేసే విధంగా ఉంటాయి. కానీ అవి వాళ్ళ అమ్మ పంపే కోట్స్ అంటూ సమంత చెబుతూ ఉంటుంది.

కాబట్టి.. సమంత కామెంట్స్ ను లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య ఆమె పై ట్రోలింగ్ ఎక్కువవుతుంది అనే చెప్పాలి. ఎందుకు ఛాన్స్ దొరికినప్పుడల్లా సమంతని ట్రోల్ చేస్తున్నారు అనేది అంతుచిక్కని ప్రశ్న. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. అందులో “నిజాలు అనేవి అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలు మాత్రమే ప్రచారంలో ఉంటాయి. అంతేకాదు అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది” అంటూ రాసుకొచ్చింది సమంత.

ఓ హాలీవుడ్‌ సినిమాకు సంబంధించి సమంత ఈ పోస్ట్‌ పెట్టినట్టు కొందరు అంటుంటే మరికొందరు తన మాజీ భర్త పై ఇలాంటి కామెంట్స్ చేసింది అని అంటున్నారు. అందరూ ఇలా మాట్లాడుకోవాలనే సమంత ఇలా కామెంట్లు పెడుతుంది అనేది నిజం. సమంత మాత్రమే కాదు సెలబ్రిటీలు అందరూ ఇలాంటి కామెంట్లు అందుకే పెడతారు అనేది ఎవ్వరూ ఊపుకోలేని నిజం.

ఏదేమైనప్పటికీ సమంత చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో భాగంగా ఆమె ప్రస్తుతం కాశ్మీర్ లో ఉంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus