Trisha: రెమ్యూనరేషన్ భారీగా పెంచిన త్రిష?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి నటి త్రిష ప్రస్తుతం మరోసారి కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఒకప్పుడు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి ఈమె కొంతకాలం పాటు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకేక్కిన పొన్నియన్ సెల్వం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తదుపరి తెలుగు తమిళ భాష చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా తరువాత త్రిష లోకేష్ కనకరాజు దర్శకత్వంలో హీరో విజయ్ తో కలిసి లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక లియో సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు స్టార్ హీరోల పక్కన సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మరోసారి మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో చేసే అవకాశం అందుకున్నారు. అయితే ఈ సినిమా కోసం త్రిష భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. లియో సినిమా కోసం ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న త్రిష ఈ సినిమా కోసం 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఇలా ఒక సినిమాకు 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు ఈ స్థాయిలో బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఈమె మాత్రం నయనతారను బీట్ చేసి ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈమె (Trisha) రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో అధికారిక ప్రకటన లేకపోయినా ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus