టాలీవుడ్ లో పలు హిట్టు సినిమాలు తీసిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. ‘వారసుడు’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి నుంచి ఈ సినిమాపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మొదలైన ట్రోలింగ్.. సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’, ‘అల.. వైకుంఠపురములో’ ఇలా పలు తెలుగు సినిమాలను కలిపి తీసినట్లుగా ‘వారసుడు’ సినిమా ఉందని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తమిళ ఆడియన్స్ నుంచి పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ.. తెలుగు ఆడియన్స్ మాత్రం సినిమాను బాగా ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు వంశీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన బాగా హర్ట్ అయినట్లు ఉన్నారు. దీంతో ఈ ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించారు. ఎంతో కష్టపడి సినిమా తీస్తామని.. తమ కష్టాన్ని ఎలా ట్రోల్ చేస్తారంటూ ప్రశ్నించారు. తన సినిమాను సీరియల్ తో పోల్చినందుకు ఫైర్ అయ్యారు వంశీ పైడిపల్లి.
దీంతో మరోసారి నెటిజన్లు వంశీని టార్గెట్ చేశారు. ఎలాంటి సినిమా తీసినా.. విమర్శించకుండా చూడాల్సిందే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సినిమా కోసం అందులో పని చేసేవాళ్లు ఎంత కష్టపడతారో.. మిగతా రంగాల్లో కూడా అలానే కష్టపడతారని.. కేవలం సినిమా వాళ్లదే కష్టమని అనుకోవడం పొరపాటని అంటున్నారు. కష్టపడి సినిమా తీశాం కాబట్టి తాము ఏం తీస్తే అది చూడాలని చెప్పడం కరెక్ట్ కాదని వంశీని ఉద్దేశిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
ఒక నెటిజన్ అయితే హోటల్ ఫుడ్ తో సినిమాను పోలుస్తూ.. వంశీకి క్లాస్ పీకాడు. డబ్బులు పెట్టి హోటల్ లో ఫుడ్ కొనుక్కున్నప్పుడు.. వాళ్లు పాడైన భోజనం పెడితే.. తిరిగి ప్రశ్నించకూడదా..? అని వంశీకి కౌంటర్ వేశారు. డబ్బులు పెట్టి సినిమా చూడాలని థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు క్వాలిటీ సినిమా అందించాల్సిన బాధ్యత దర్శకనిర్మాతలదేనని.. పాత సినిమాలను మిక్స్ చేసి.. సినిమా చేస్తే ఏం కష్టపడినట్లు అంటూ విమర్శిస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?