సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ప్లస్ అవ్వాలి తప్ప.. గుదిబండ కాకూడదు అంటారు. అంటే సినిమాకు అవి హెల్ప్ చేస్తే చేయాలి కానీ.. తలనొప్పిగా మారకూడదు. దీనికి సరైన ఉదాహరణ కావాలి అంటే ‘ఆచార్య’ సినిమా గురించే చెప్పాలి. ఇటీవల విడుదలై సినిమా టీమ్‌కి, అభిమానులకు పీడకలలా మారిన సినిమా ఇది. సినిమాలో సత్తా లేకపోవడంతో ఓ సమస్య అయితే, ఓ సన్నివేశంలో చిరంజీవి యువకుడిగా చూపించే ప్రయత్నంలో వాడిన VFX దెబ్బకొట్టాయి. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’, విషయంలోనూ అలాంటి పరిస్థితే వస్తుందా? టీజర్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
సినిమాల్లో VFX వాడకంలో శంకర్, రాజమౌళి లాంటి దర్శకులు ఓ స్టాండర్డ్ క్రియేట్ చేశాడు. కళ్లను మాయ చేసేలా ఆ VFX ఉండాలి చెప్పారు. దీన్ని కొంతమంది దర్శకులు ఆ తర్వాత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే ‘ఆచార్య’ విషయంలో కొరటాల శివ సరైన పనితనం తీసుకోలేకపోయారు. దాంతో ఆ సీన్స్ తెర మీద కనిపించిన అందరూ నవ్వుకున్నారు. సీరియస్ సీన్‌లో నవ్వులు వినిపించాయి అంటే ఆ VFX నాణ్యత అర్థం చేసుకోవచ్చు.
తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా టీజర్ విడుదలైంది. అందులో కారులో ఓ గోడను పగలకొట్టుకుంటూ చిరంజీవి, సల్మాన్ ఖాన్ వస్తారు. మామూలుగా అయితే ఆ సీన్‌కి థియేటర్లలో విజిల్స్ పక్కా. అయితే ఈ సీన్ కోసం వాడిన VFX నాణ్యత ఏమీ బాలేదు. దీంతో ఇదే సీన్ థియేటర్లలో పడితే మరోసారి ‘ఆచార్య’ తరహాలో నవ్వుకుంటారేమో అని భయం కలుగుతోంది అభిమానులకు. మోహన్‌రాజా ఇలాంటి విషయాలు చూసుకోకపోతే నవ్వులపాలు అవ్వడం ఖాయం అని అంటున్నారు.
సినిమాకు ఇంకా 40 రోజులు ఉన్న నేపథ్యంలో ఏమన్నా మార్పులు చేస్తారేమో చూడాలి. ఇక ఈ మద్యే వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ ఇలాంటి సీన్సే చూశాం. బీచ్ దగ్గర మహేష్‌బాబు, నదియ మాట్లాడుతున్న సన్నివేశాల్లో లైటింగ్ సరిగ్గా చూసుకోకపోవడంతో ఆ సీన్స్ కాస్త ఎబ్బెట్టుగా కనిపించాయి. VFX చేశారు కానీ, సరిగ్గా చేయలేదు అనే విమర్శలు వచ్చాయి. కాబట్టి దర్శకులూ VFX సంగతి జాగ్రత్తగా చూసుకుందురు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?