Vinayak, Chiranjeevi: చిరు-వినాయక్ కాంబోలో మరో మూవీ.. హ్యాట్రిక్ కొడతారా?

మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు వి.వి.వినాయక్ పై నమ్మకం ఎక్కువ. ‘రమణ’ కథని చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు ఎంత చక్కగా మార్చి ‘ఠాగూర్’ గా తీసాడో అందరూ చూశారు. నిజానికి ‘రమణ’ కథలో డ్యూయెట్లు వంటివి ఉండవు, పైగా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. తెలుగుకి వచ్చేసరికి వినాయక్.. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు డ్యూయెట్లు వంటివి పెట్టారు, క్లైమాక్స్ కూడా చాలా కన్వెన్సింగ్ గా డిజైన్ చేశారు. ఓ అభిమాని చిరుతో సినిమా తీస్తే ఇలా ఉంటుందేమో అని అంతా అనుకునేలా చేశాడు వినాయక్.

చిరు రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు కూడా ఆయనకు వినాయక్ తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు అంటే.. వినాయక్ పై చిరుకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘ఖైదీ నెంబర్ 150’ ని కూడా వినాయక్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇలా రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఈ కాంబోలో ‘మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుంది. హ్యాట్రిక్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?’ అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.

నిజానికి ‘లూసిఫర్’ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను వినాయక్ కు అప్పగించాలి అని చిరు భావించారు. కానీ వినాయక్.. ఆ కథ చేయడం రిస్క్ అని భావించి తప్పుకున్నారు. మరోపక్క ఆయన ‘ఛత్రపతి’ ని హిందీలో రీమేక్ చేసే పనిలో కూడా బిజీగా ఉండడంతో అది కుదరలేదు. అయితే ఇప్పుడు చిరుతో హ్యాట్రిక్ మూవీ చేయడానికి వినాయక్ రెడీ అవుతున్నట్లు సమాచారం. చిరు కూడా వినాయక్ తో సినిమా చేసి హ్యాట్రిక్ కొట్టాలని పరితపిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్యకి చిరు ఓ సినిమా చేసి పెట్టాలి. అందుకు వెంకీ కుడుముల దర్శకుడిగా అనుకున్నారు. కానీ వెంకీ స్క్రిప్ట్ చిరుకి నచ్చినట్టు లేదు.. అతను నితిన్ తో మైత్రిలో సినిమా చేయడానికి షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు వెంకీ ప్లేస్ లోకి వినాయక్ వచ్చినట్టు తెలుస్తుంది. చిరు- వినాయక్ – దానయ్య ఈ కాంబోలో మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus