ఒకేసారి రెండు ప్రాజెక్టులు.. చిరు ప్లానింగ్ మామూలుగా లేదు!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా పోటీగా ఉన్నప్పటికీ.. ‘వాల్తేరు వీరయ్య’ భారీ వసూళ్లు సాధించింది. ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi No. 150) తర్వాత మెగా అభిమానులు ఆశించిన అన్ని అంశాలు ‘వాల్తేరు వీరయ్య’ లో ఉన్నాయి. డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్ సీన్స్ ఇలా అన్నీ లభించాయి.

Waltair Veerayya

పైగా రవితేజ (Ravi Teja) కూడా ముఖ్య పాత్ర పోషించడం అనేది సినిమాకు మరింత ఆకర్షణ చేకూర్చినట్టు అయ్యింది. అందుకే ఫాన్స్ రిపీటెడ్ గా ఈ సినిమాని వీక్షించారు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.250 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టైంలో బాబీ పనితనంతో చిరు బాగా ఇంప్రెస్ అయ్యారు. సినిమా ఫాస్ట్ గా…

అనుకున్న బడ్జెట్లో తీసి నిర్మాతలకు కూడా ఫేవరెట్ అయిపోయాడు బాబీ. అందుకే చిరు అతనికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. బాలయ్యతో బాబీ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే సినిమా చేశాడు. అది 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇక చిరు ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. సో సమ్మర్ లో బాబీ- చిరు..ల సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోపక్క అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కూడా చిరు ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది సేమ్ టైంలో సెట్స్ పైకి వెళ్లొచ్చు. రెండు సినిమాలని సమాంతరంగా ఫినిష్ చేయాలనేది చిరు ప్లాన్ గా తెలుస్తుంది. అటు తర్వాత ‘దసరా’ (Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా చిరు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus