Adipurush: ఆదిపురుష్ నుంచి మరో టీజర్ రిలీజ్ కానుందా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో అని ప్రభాస్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను తగ్గించింది. అనేక విషయాలలో ఈ సినిమా టీజర్ గురించి ట్రోల్స్ వచ్చాయి. ప్రభాస్ అభిమానులు సైతం టీజర్ తమకు ఏ మాత్రం నచ్చలేదని అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మరీ దారుణంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఈ సినిమాను నిజంగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కించారా? అని సైతం కొంతమంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఆదిపురుష్ నుంచి రిలీజయ్యే మరో టీజర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీ మరో టీజర్ తో అయినా సినిమాపై అంచనాలను పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆదిపురుష్ మూవీ తెరకెక్కిందని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ చూస్తే మాత్రం

ఈ సినిమాకు కనీసం 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓం రౌత్ కెరీర్ కూడా ఈ సినిమాపైనే డిపెండ్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ స్థాయి పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. కృతిసనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సీత రోల్ తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని కృతిసనన్ భావిస్తున్నారు..

ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్ గా నిలుస్తుందో లేక అంచనాలను అందుకోలేక తడబడుతుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ సినిమాకు ప్రభాస్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus