Balakrishna: మరో కథకు ఓకే కూడా చెప్పారా?

వరుసగా సినిమాలు చేసే నందమూరి అందగాడు బాలకృష్ణ… కరోనా పరిస్థితుల కారణమో, ఇంకెందుకో కానీ కొంచెం స్లో అయ్యాడు. అయితే బాలయ్య జోరు చూస్తుంటే… మళ్లీ జోరు చూపించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య బాలకృష్ణ వరుసగా కథలు వింటున్నారట. అందులో ఇద్దరు దర్శకులకు ఓకే చెప్పారని కూడా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఫైనల్‌ నెరేషన్‌ విని ఓకే చేస్తారని టాక్‌. బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ పనుల్లో బిజీగా ఉన్నాడు.

పరిస్థితులు కుదిరితే త్వరలోనే సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని సినిమా చేస్తారు బాలయ్య. ఇప్పటికే దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఏ సినిమాలు లైనప్‌లో ఉన్నాయనేది చూచాయగా తెలిసిపోతోంది. దాని బట్టి చూస్తే బాలయ్య వరుసగా నాలుగు సినిమాలు ఓకే చేసినట్లే అంట. గోపీచంద్‌ సినిమా తర్వాత బాలయ్య అనిల్‌ రావిపూడి సినిమాలో నటించాలి. అయితే దీనిపై క్లారిటీ రావడం లేదు.

అనిల్‌కి వేరే సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు బాలయ్య నుండి ఇంకా సరైన క్లారిటీ కూడా రాలేదట. ఆ సినిమా తర్వాత శ్రీవాస్‌ ఓ కథ వినిపించారట. కార్పొరేట్‌ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఇందులో బాలయ్య ఓ పెద్ద కంపెనీ సీఈవో కనిపిస్తారట. ఇదిలా ఉండగా ఇటీవల రచయిత ఎం.రత్నం బాలయ్యకు ఓ కథ వినిపించాట. ఈ సినిమాకు బాలయ్య దాదాపు పచ్చ జెండా ఊపినట్లే అని చెబుతున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus