Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఏమైందంటే?

2023 సంవత్సరంలో తారక్ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాకపోవడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే 2024లో మాత్రం తారక్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని ఎన్టీఆర్ ఈ విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది తన సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో నిరాశ చెందుతున్న ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ శుభవార్త చెప్పనున్నారని బోగట్టా. ఈ ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మూవీ షూట్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో తారక్ కొరటాల శివ కాంబో మూవీ రిలీజ్ కానుందని వచ్చే ఏడాది డిసెంబర్ లో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. వచ్చే నెల నుంచి తారక్ వరుస సినిమాల షూటింగ్ లతో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. తారల్ ప్రశాంత్ నీల్ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి తారక్ ఎదగడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

తారక్32 ప్రాజెక్ట్ కు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో తారక్32 సినిమాకు దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. పాన్ ఇండియా డైరెక్టర్లకు మాత్రమే తారక్ ఓటేస్తుండగా ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ లో మరో సినిమా దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా తారక్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్30 సినిమాలో కొరటాల శివ తారక్ ను ఏ విధంగా చూపించబోతున్నారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus