Prabhas: అలా చేయాలని ప్రభాస్ బలంగా ఫిక్స్ అయ్యారా?

స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అయితే ప్రభాస్ బాహుబలి సిరీస్ సినిమాలలో తండ్రీకొడుకు పాత్రలలో కనిపించడంతో పాటు ఈ సినిమా కోసం బరువు తగ్గడం పెరగడం చేశారు. అయితే రాధేశ్యామ్ సినిమా లుక్ విషయంలో ప్రభాస్ పై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియా నుంచి కూడా ప్రభాస్ లుక్ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. వైరల్ అయిన నెగిటివ్ కామెంట్లు ప్రభాస్ దృష్టికి కూడా వచ్చాయని సమాచారం.

Click Here To Watch NOW

ప్రభాస్ బరువు తగ్గాలని బలంగా ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ప్రభాస్ లుక్ ను కూడా మార్చుకోనున్నారని వర్కౌట్ల ద్వారా మునుపటి లుక్ ను పొందడానికి ప్రభాస్ కృషి చేస్తున్నారని బోగట్టా. ప్రభాస్ బరువు తగ్గడం కోసం ప్రత్యేకంగా పర్సనల్ ట్రైనర్ ను నియమించుకున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ బరువు తగ్గి కొత్త లుక్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ లుక్ ను మార్చుకోవడంతో పాటు వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ త్వరలో సలార్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారు. స్పిరిట్, ప్రాజెక్ట్ కె మరికొన్ని సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను సాధిస్తారని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ప్రభాస్ స్టార్ డైరెక్టర్లకు వరుసగా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. ప్రభాస్ కు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో మారుతి సినిమా మినహా మిగిలిన సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus