టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి (Baahubali) సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అని మాట్లాడుకోవాలి. బాహుబలి, బాహుబలి2 (Baahubali2) , సాహో (Saaho) , రాధేశ్యామ్ (Radhe Shyam) , ఆదిపురుష్ (Adipurush) , సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కాయి. ఈ ఏడు సినిమాల టోటల్ బడ్జెట్ ఏకంగా 2200 కోట్ల రూపాయలు కాగా ఈ 7 సినిమాలకు ఏకంగా 5300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఒక స్టార్ హీరో ఏడు సినిమాలు 5000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం ప్రభాస్ విషయంలోనే జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ సినిమాలు సాధించిన కలెక్షన్లు బడ్జెట్ కు రెట్టింపు మొత్తంతో పోలిస్తే ఎక్కువ కావడం గమనార్హం. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ సైతం ఇదే రేంజ్ లో కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న నేపథ్యంలో ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. కల్కి సీక్వెల్ షూట్ లో ప్రభాస్ త్వరగా పాల్గొంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ లలో ఏ సినిమా ముందు విడుదలవుతుందనే చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం.
ప్రభాస్ వైపు నుంచి రియాక్షన్ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత వస్తుంది. ప్రభాస్ ఇతర హీరోలకు భిన్నంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నార్త్ బెల్ట్ లో సైతం ప్రభాస్ సంచలన రికార్డులను సాధిస్తూ అక్కడి హీరోలను ఆశ్చర్యపరుస్తున్నారు.