Prabhas: బాహుబలి, బాహుబలి2, సలార్.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ చేరిందిగా!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తోంది. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి2, సలార్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ లో 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సాధించిన మూడు సినిమాలు కేవలం ప్రభాస్ కు మాత్రమే సొంతం కావడం గమనార్హం.

ఈ అరుదైన రికార్డ్ సాధించిన ఏకైక సౌత్ నటుడు ప్రభాస్ మాత్రమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సలార్ సినిమాకు ఈ వీకెండ్ కలెక్షన్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా మిగతా ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సాధించిన కలెక్షన్లను సలార్ మూవీ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

డెవిల్ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చినా సలార్ కలెక్షన్లపై ఈ సినిమా ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ లేదు. ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ పై మరింత దృష్టి పెడితే ఆ సినిమాలు మరింత సత్తా చాటే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు సలార్2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్2 మూవీ షాకింగ్ ట్విస్టులతో ఉండబోతుందని తెలుస్తోంది.

సలార్2 మూవీలో ప్రభాస్ (Prabhas) మరో లుక్ లో కనిపిస్తారని ఆ లుక్ క్రేజీగా ఉండబోతుందని సమాచారం అందుతోంది. సలార్2 సినిమా బాహుబలి2 రేంజ్ సినిమా అవుతుందని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్2 సినిమాతో ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. సలార్2 మూవీ సంచలనాలు సృష్టించే సినిమా కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్2 ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus