టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళికి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రాజమౌళి ప్రమోషన్స్ చేయడం వల్లే బ్రహ్మాస్త్రం సినిమాకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. అయితే తాజాగా జక్కన్న ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో హాలీవుడ్ లెవెల్ లో కూడా జక్కన్న పేరు వినిపిస్తోంది. అయితే అమెరికాలో త్వరలో హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియండ్ ఫెస్ట్ జరగనుండగా
ఈ ఫెస్ట్ లో రాజమౌళి గత సినిమాలు ప్రదర్శించనున్నారని సమాచారం అందుతోంది. టీసీఎల్ థియేటర్ ఐమ్యాక్స్ లో ఈ నెల 30వ తేదీన మొదట ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. అక్టోబర్ 1వ తేదీన బాహుబలి పార్ట్1, బాహుబలి పార్ట్2 సినిమాలు నెక్స్ట్ ముబీ థియేటర్ లో ప్రదర్శితం కానున్నాయని సమాచారం అందుతోంది. అక్టోబర్ నెల 21వ తేదీన మగధీర, అక్టోబర్ నెల 23వ తేదీన మర్యాదరామన్న సినిమాలు సైతం రాజమౌళి
ఇతర సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలోనే ప్రదర్శించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజమౌళి అరుదైన ఘనతలను ఖాతాలో వేసుకుంటూ ఉండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. సినిమాసినిమాకు జక్కన్నకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ 2025లో విడుదలయ్యే అవకాశం ఉండగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రాజమౌళి నిదానంగానే సినిమాలను తెరకెక్కిస్తున్నా ప్రతి ప్రాజెక్ట్ అంచనాలను మించి సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబో మూవీ 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. 2023 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!