రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మరో నాలుగు వారాల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో విద్యార్థులు పరీక్షలతో, యువత ఐపీఎల్ మ్యాచ్ లతో బిజీ అయ్యే అవకాశం ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై కొంతమేర ప్రభావం పడే ఛాన్స్ ఉన్నా మేకర్స్ రిస్క్ చేసి ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ చరణ్ అభిమానులతో పాటు తారక్ అభిమానులకు తెగ నచ్చింది. యూట్యూబ్ లో నాటునాటు తెలుగు వెర్షన్ తో పాటు ఇతర వెర్షన్లకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం. చరణ్, ఎన్టీఆర్ లకు ఉన్న క్రేజ్ కు జక్కన్న పాపులారిటీ తోడు కావడంతో ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అన్ని భాషల్లో నాటు నాటు సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఈ పాట రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.
కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా నాటునాటు సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఈ పాట వ్యూస్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ పై నాటునాటు సాంగ్ అంచనాలను మరింత పెంచింది. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలైనా కథ విషయంలో ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా.