ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిడిల్ రేంజ్ హీరోలలో కూడా చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలలో చాలా సినిమాలు మాత్రం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కడం లేదు. సర్కారు వారి పాట సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, పరశురామ్ మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోంది. ఆగష్టు నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడం లేదని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా హరీష్ శంకర్ తన సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని అనుకుంటారో అదే విధంగా చూపిస్తారు.
హరీష్ శంకర్ సినిమాలో ఫ్యాన్స్ కు నచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. హరీష్ శంకర్ సినిమాలు హిందీ ప్రేక్షకులకు సైతం నచ్చేలా ఉండటం గమనార్హం. హరీష్ శంకర్ ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లెక్చరర్ రోల్ లో కనిపించనున్నారు.
పవన్ తొలిసారి ఇలాంటి రోల్ లో కనిపిస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. హరీష్ పవన్ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మైత్రీ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.