యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. కొత్త టికెట్ల జీవో అమలులోకి రావడంతో పాటు ఆర్ఆర్ఆర్ కు టికెట్ రేట్లను మరింత పెంచుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చరణ్, ఎన్టీఆర్ ఒకే సినిమాలో నటించడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తొలిరోజు కలెక్షన్లు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొరకు ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పదని తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడంతో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఊహించని స్థాయిలో అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇద్దరు హీరోల అభిమానులకు వేల సంఖ్యలో పాస్ లు ఇవ్వడం ఈవెంట్ సమయంలో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం సులువైన విషయం కాదు. అందువల్ల ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ ఈవెంట్ లేనట్టేనని ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో నెలకొన్న సందేహాలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కగా ఫుల్ రన్ లో ఈ సినిమా 2,000 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.