Devara: దేవర లెక్కలు మారుతున్నాయా.. బాలీవుడ్ లో సైతం చరిత్ర సృష్టిస్తుందా?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై రోజులు గడుస్తున్న కొద్దీ ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఆచార్య సినిమా ఫ్లాపైనా కొరటాల శివ ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు దేవర విషయంలో జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర సినిమా షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం జరుగుతుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

హిందీలో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కొన్ని నిమిషాల పాటు మరో స్టార్ హీరో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో స్టార్ హీరో కనిపించనున్నారని ఆ రోల్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇప్పటికే ప్రకటన వెలువడింది.

కొరటాల శివ అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తారక్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన దేవర1 రిలీజ్ కానుండగా దేవర2 సినిమా మాత్రం ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లనుంది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా చాలా కాలం క్రితమే కెరీర్ ను మొదలుపెట్టినా కెరీర్ లో సరైన సక్సెస్ లేదు. అయితే దేవర సినిమా మాత్రం జాన్వీ కపూర్ కు ఆ లోటును తీరుస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేవర (Devara) సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus