తాటిని తన్నే వాడుంటే.. వాడి తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడనేది బాహుబలి 2 విషయంలో నిజం అవుతుంది. ఇప్పటి వరకూ బాహుబలి 2 రికార్డ్స్ సునామీకి పాత రికార్డ్స్ అన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. విడుదలైన తొలిరోజు నుండే కలెక్షన్స్ కింగ్ గా నిలుస్తూ.. దేశ విదేశాల్లోనూ తన దమ్ము చూపింది బాహుబలి 2. ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి తొలిత 1000 కోట్లు , ఆతరువాత 1500 కోట్లను కొల్లగొట్టి భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ పేజీకెక్కింది బాహుబలి 2. అయితే విడుదలైన మూడు వారాల్లో 1500 కోట్లను కొల్లగొట్టడం అంటే సాధారణమైన విషయం కాదని.. ఇప్పట్లో ఈ రికార్డ్స్ ను బ్రేక్ చేసే సినిమా రాకపోవచ్చునని మార్కెట్ పండితులు అంచనా వేశారు.
కానీ.. ఆ రికార్డ్ ను మేం బ్రేక్ చేస్తాం అంటూ దూసుకొస్తున్నారు రజనీకాంత్ & అమీర్ ఖాన్. రజనీకాంత్ “రోబో 2.0” మరియు అమీర్ ఖాన్-అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన “థగ్స్ ఆఫ్ హిందోస్తాన్” చిత్రాలు దీపావళి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలూ “బాహుబలి” రికార్డ్స్ ను కొల్లగొడతాయా లేదా అనే విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే.. ఆ స్థాయికి చేరుకొనే స్టామినా మాత్రం రెండు సినిమాలకు పుష్కలంగా ఉంది. మరి మన ప్రభాస్ రికార్డ్స్ సేఫ్ గా ఉంటాయో లేదో తెలియాలంటే సదరు సినిమాల రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.