Bro OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేస్తున్న ‘బ్రో’.. ఎందుకంటే?

  • August 21, 2023 / 07:59 PM IST

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో రూపొందిన ‘బ్రో’ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ.. సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ కాగా తమన్ సంగీత దర్శకుడు.

రిలీజ్ రోజున మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ ఓకే అనిపించినా బాక్సాఫీస్ వద్ద పెద్ద అద్భుతాలు అయితే ఏమీ చేయలేదు. అయితే థియేటర్లలో ‘బ్రో’ ని మిస్ అయిన ప్రేక్షకులు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ‘బ్రో’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని ముందుగానే ప్రకటన వచ్చింది. సినిమా రిలీజ్ అయిన 5 వారాల తర్వాత…నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేసుకునేలా అగ్రిమెంట్ జరిగింది.

ఆ రకంగా చూసుకుంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా (BRO) ‘బ్రో’ డిజిటల్ రిలీజ్ ఉంటుంది అని అంతా అనుకున్నారు. నిర్మాతలు కూడా ఆ ఉద్దేశంతోనే అగ్రిమెంట్ చేయించుకున్నారు. అయితే వారం ముందు నుండే.. అంటే ఆగస్టు 25 నుండే డిజిటల్ రిలీజ్ కి రెడీ అయ్యింది ‘బ్రో’. నెట్ ఫ్లిక్స్ వారు కాస్త ముందుగా స్ట్రీమింగ్ చేసుకోవడానికి అదనంగా నిర్మాతలకి చెల్లించి ఆగస్టు 25 కి ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus