కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. దాదాపు 9 నెలల పాటు థియేటర్లు మూతపడే ఉన్నాయి. దాంతో విడుదలకు నోచుకోని సినిమాలకు నెల నెల ఇంట్రెస్ట్ లు కట్టడం భారంగా అనిపించి.. వాటిని ఓటిటిలో విడుదల చేసి.. అప్పులు తీర్చుకున్నారు కొందరు నిర్మాతలు. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం.. దర్శకనిర్మాతలకు కొంత ఊరటనిచ్చినట్టు అయ్యింది. కానీ ఆ సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు అనేది వాస్తవం.
దాంతో దర్శకనిర్మాతలు కూడా తమ సినిమాలను కేవలం 7 రోజులు లేదా 10 రోజుల్లో ఓటిటిల్లో విడుదల చేసుకోవచ్చు అనే డీల్ కు ఓకే చెప్పి ఫ్యాన్సీ అమౌంట్ ను దక్కించుకుంటున్నట్టు భోగట్టా..! దీని ప్రకారం చూసుకుంటే.. ఒక్క ‘మాస్టర్’ తప్ప రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ల ‘అల్లుడు అదుర్స్’ వంటి చిత్రాలు రెండు వారాల్లోపే ఓటిటిల్లో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందట. కాబట్టి సంక్రాంతికి విడుదలయ్యే తెలుగు సినిమాలు
అన్నీ వాటికి జరిగిన బిజినెస్ ను 10 రోజుల్లోనే రికవరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు కూడా 100శాతం ఆకుపెన్సీతో రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఈ సినిమాలు 5 రోజుల్లోనే సేఫ్ అయిపోవడం ఖాయమని చెప్పొచ్చు.చూడాలి మరి ఈ సంక్రాంతి సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతుందో..!