ఎవ్వరూ టచ్ చెయ్యని రికార్డు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సొంతం..!

ఓ స్టార్ హీరో కొడుక్కి కూడా అంత గ్రాండ్ లాంచింగ్ దక్కుతుందో లేదో తెలీదు కానీ..అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం ఓ రేంజ్ లాంచింగ్ దక్కింది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లుడు శీను’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా కూడా నర్తించింది.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బ్రహ్మానందం వంటి స్టార్ క్యాస్ట్. ఇంకేముంది సినిమా మంచి హిట్ అయ్యింది. శ్రీనివాస్ కు మొదటి సినిమాతోనే మంచి మార్కెట్ ఏర్పడింది. 2014 జూలై 25 న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈరోజుతో ‘అల్లుడు శీను’ విడుదలయ్యి 6 ఏళ్ళు పూర్తయ్యింది. అంతేకాదు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యి కూడా 6 ఏళ్ళు పూర్తయ్యింది. వినాయక్ కు మాస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా అదిరిపోయాయనే చెప్పాలి.

2014 టైంకే ఈ చిత్రం 25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డెబ్యూ హీరో సినిమా అంత కలెక్ట్ చెయ్యడం కూడా అదే మొదటిసారి. ఇప్పటి వరకూ ఆ రికార్డ్ శ్రీనివాస్ పేరు మీదే ఉండడం మరో విశేషం. ఇక గతేడాది ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకున్న శ్రీనివాస్.. ప్రస్తుతం ‘కందిరీగ’ ‘రభస’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రం చేస్తున్నాడు.ఇదిలా ఉండగా.. ఈ కుర్ర హీరో త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నట్టు టాక్.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus