ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన ఆర్మాక్స్ ప్రతి నెలా గత నెలకు సంబంధించిన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ డిసెంబర్ 2023 జాబితాలో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న గుర్తింపు వల్లే ఈ అరుదైన ఘనత దక్కింది. ప్రభాస్ తొలి స్థానంలో ఉండగా ఈ జాబితాలో రెండో స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
ఆర్.ఆర్.ఆర్ తో వచ్చిన గుర్తింపుతో పాటు తనకు ఉన్న అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ వల్లే తారక్ (Jr NTR) ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలవగా మహేష్ బాబు నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ ఐదో స్థానంలో, పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం.
హాయ్ నాన్న సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నాని ఏడో స్థానంలో నిలవగా త్వరలో ఈగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ ఎనిమిదో స్థానంలో నిలిచారు. విజయ్ దేవరకొండ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా నందమూరి బాలకృష్ణ పదో స్థానంలో నిలిచారు. బాలయ్యకు ఈ జాబితాలో చోటు దక్కడంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
ఆర్మాక్స్ సర్వే ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో క్రేజ్ ను మరింత పెంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ అంచనాలను మించి పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. టాలీవుడ్ హీరోలు స్థాయిని మరింత పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.