కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. థియేటర్లు మూతపడటంతో ఓటిటి సంస్థలకు రెక్కలొచ్చినట్టు అయ్యింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను దర్శక నిర్మాతలు కొంతకాలం చూసి.. తమ సినిమాలకు వడ్డీలు కట్టలేక మంచి రేటు వస్తే.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ ఇచ్చేస్తే పర్వాలేదు.. కానీ ఒకేసారి థియేటర్లలో మరియు పే పెర్ వ్యూ పద్ధతిలో ఓటిటి విడుదల చేస్తాము అంటే ఫలితం తేడా కొట్టేస్తుంది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా సల్మాన్ ‘రాధే’ ను చెప్పుకోవచ్చు. కరోనా కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూత పడినప్పటికీ.. కొన్ని చోట్ల థియేటర్ లు తెరిచి ఉండడంతో అక్కడ రిలీజ్ చేశారు. కానీ థియేటర్లలో ‘రాధే’ కు డిజాస్టర్ ఫలితం వచ్చింది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం.. రూ.60 వేలు మాత్రమే కలెక్ట్ చేసిందట. మామూలు రోజుల్లో రిలీజ్ చేస్తే.. ఒక్క షోకే అరకోటి పైనే కలెక్షన్స్ నమోదవుతాయి. కానీ సల్మాన్ వంటి పెద్ద హీరో సినిమా అయినప్పటికీ..
అక్కడ హౌస్ ఫుల్స్ పడలేదు. దీనికి బ్యాడ్ టాక్ రావడం అనేది ఒక కారణం అయితే.. మరొకటి సినిమాని ఓటిటి రిలీజ్ చెయ్యడం రెండో కారణమని థియేటర్ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఓటిటిలో రిలీజ్ చెయ్యడం వలన హై క్వాలిటీ తో కూడిన ప్రింట్ అనేది పైరసి వెబ్ సైట్లలో పెట్టేస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు అక్కడ ఫ్రీగా చూసేయడం లేదా డౌన్లోడ్ చేసుకుని చూడడం వంటివి చేస్తుంటారు. అందువల్ల ‘రాధే’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు పెద్ద దెబ్బ పడినట్టు స్పష్టమవుతుంది. అయితే ఓటిటిలో మాత్రం ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికి రూ.100 కోట్ల పైనే వసూళ్ళను రాబట్టింది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!