OTT డీల్స్.. నిర్మాతలకు మరో టెన్షన్ తప్పేలా లేదు?

  • November 26, 2024 / 07:43 PM IST

కరోనా పాండమిక్‌ వల్ల దేశంలో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫార్మ్స్‌ కు వచ్చిన విపరీతమైన క్రేజ్‌ కొత్తదేం కాదు. కొవిడ్ సమయంలో థియేటర్లు మూసుకుపోవడంతో ఎక్కువ మంది నేరుగా ఓటీటీలకే కనెక్ట్ అయ్యారు. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా వంటి పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌ ఒక పెద్ద మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే, గతంలో భారీ మొత్తాలు పెట్టి సినిమాలను కొనుగోలు చేసిన ఓటీటీలు ఇప్పుడు దాని ధోరణి మార్చుకున్నాయి. ప్రస్తుతం చిత్రాల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో, అన్ని సినిమాలకు ఒకే తరహా డీల్స్‌ ఇవ్వడం కష్టమవుతోంది.

OTT

పెద్ద హీరోల సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, మిగతా చిత్రాలకు ‘పే పర్ వ్యూ’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ఓటీటీలు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, వసూళ్ల పరంగా తక్కువ ఒత్తిడి అనుభవిస్తున్నాయి. అయితే, ఇది నిర్మాతలపై ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మీడియం, చిన్న బడ్జెట్ తో వచ్చే సినిమాలపై ఓటీటీల (OTT) ఆసక్తి తగ్గుతోంది. పెద్ద హీరోల చిత్రాలు మాత్రం ఎప్పటిలాగే భారీ మొత్తాలతో కొనుగోలు అవుతున్నాయి.

ఇక మధ్య తరహా సినిమాలకు డిజిటల్ హక్కులు దక్కడం కష్టమవుతోంది. దీంతో, నిర్మాతలు సినిమాల డిజిటల్ రైట్స్‌ నుంచి రావలసిన ఆదాయంపై అంతగా ఆధారపడకుండా కొత్త వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక, ఓటీటీలు స్వతంత్రంగా రూపొందించిన సిరీస్‌లు, ఒరిజినల్‌ కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అంతే కాకుండా, ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్‌ను బట్టి కాంట్రాక్ట్‌లు కుదుర్చుకుంటున్నాయి.

ఈ మార్పుల వల్ల నిర్మాతలు ఎక్కువగా తికమక పడాల్సి వస్తోంది. ఓటీటీల ఇస్తున్న ప్రమోషన్‌ సపోర్ట్‌ కూడా భారీగా తగ్గడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో, నిర్మాతలు ఇకపై తమ వ్యాపార మోడల్‌ను మార్చుకోవాలి. సినిమాలు థియేట్రికల్ రన్‌ మీద ఆధారపడేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఓటీటీలపై పూర్తిగా ఆధారపడడం వల్ల వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవడం అవసరం.

డాకు మహరాజ్.. మొదటి జాతర అక్కడే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus