నెటిజన్ల కోపాన్ని కూడా వాడేసుకొంటున్న ఓటీటీలు!

హిందీ సినిమా “సడక్ 2” ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి సోషల్ మీడియాలో ఒకటే గోల. సినిమాను బ్యాన్ చేయమని కొందరు, ఏకంగా హాట్ స్టార్ ప్లాట్ ఫార్మ్ నే బ్యాన్ చేయమని ఇంకొందరు హడావుడి చేస్తూనే ఉన్నారు. అయితే.. హడావుడి మొత్తాన్ని హాట్ స్టార్ సంస్థ తమకు లాభసాటిగా వాడుకొంటోంది. సందులో సడేమియా అన్నట్లు #WeSupportHotStar అనే ట్విట్టర్ క్యాంపైన్ మొదలెట్టింది. ఈ రచ్చ పుణ్యమా అని చాలా యావరేజ్ గా ఉన్న “సడక్ 2” ట్రైలర్ ఇండియా వైడ్ నెంబర్ 1 లో ట్రెండ్ అవ్వడమే కాక..

మోస్ట్ డిస్లైక్స్ వీడియోగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ బాయ్ కాట్ హాట్ స్టార్ వల్ల కానీ.. ట్రైలర్ కి ఎక్కువ డిస్ లైక్స్ లభించడం వల్ల కానీ హాట్ స్టార్ కి పెద్దగా నష్టమేమీ లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్లకి ఎక్కడలేని పబ్లిసిటీ. ఆల్రెడీ ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణాలను విశేషమైన రీతిలో పబ్లిసిటీకి వినియోగించుకున్న హాట్ స్టార్ ఇప్పుడు ఈ నేపోటీజాన్ని కూడా పబ్లిసిటీకి వినియోగించుకుంటూ..

ప్రమోషన్స్ కి సరికొత్త బాట వేస్తోంది. ఇకపోతే.. సంజయ్ దత్, ఆలియా, ఆదిత్య కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “సడక్ 2” ఆగస్టు 28 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వనుంది. గొడవ ఏదైనా సరే అది హాట్ స్టార్ కి ఈ రకంగా ప్లస్ అవుతోందన్నమాట.
Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags