Tripti Dimri: ఎన్నో కష్టాలు.. అవమానాల ఫలితం ఇది.. త్రిప్తి డిమ్రి ఎమోషనల్‌!

త్రిప్తి డిమ్రి (Tripti Dimri) .. చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉన్నా.. ‘యానిమల్‌’ (Animal) సినిమాతో అమాంతం పేరు సంపాదించేసుకుంది. అలా అని ఆ సినిమాలో ఆమె హీరోయినా? అంటే కాదు. మెయిన్‌ క్యారెక్టర్‌ కాకపోయినా సైడ్‌ క్యారెక్టర్‌లో అదిరిపోయే యాక్టింగ్‌ చేసిందా అంటే అదీ లేదు. కానీ ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌ మెటీరియల్‌ అయిపోయింది. ఆమె గురించి సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అదేంటి స్టార్‌ హీరోయిన్‌ అంటారు కదా.. స్టార్‌ మెటీరియల్‌ అన్నారేంటి అనే డౌట్‌ మీకు రావొచ్చు.

Tripti Dimri

అలా ఓవర్‌ నైట్‌ స్టార్ అని అనడం ఆమెకు నచ్చదులెండి. దానికి వెనుక ఉన్న కారణం కూడా ఆమె చెప్పుకొచ్చింది. రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన నటీనటులు చిత్రపరిశ్రమలో చాలా మందే ఉన్నారు. కానీ నా జీవితంలో ఆ స్టార్‌ అనే పదం వెనక ఎనిమిదేళ్ల కష్టం ఉంది అని త్రిప్తి డిమ్రీ చెప్పింది. ‘యానిమల్‌’ సినిమాతో స్టార్‌ నాయిక అయిపోయిన త్రిప్తి.. ఆ తర్వాత చేసిన సినిమాలతో ఆ స్థాయి పేరు సంపాదించలేకపోయింది.

అయినప్పటికీ ఆమె అంటే వచ్చే బజ్‌ అలానే ఉంది. అందుకే వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘భూల్‌ భులయ్యా 3’ త్వరలో విడుదల కాబోతోంది. త్రిప్తి.. స్టార్‌ అయిపోయావు కదా.. కెరీర్‌ ముచ్చట్లు చెప్పు అని అంటే.. తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని వివరించింది. కెరీర్‌ ప్రారంభం నుండి మొన్నీమధ్య వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. ఈ చిత్రసీమలో చాలాసార్లు తిరస్కరణకు గురైన నటిని నేను. ప్రతి ఆడిషన్‌లో తిరస్కరించారు.

వచ్చే అవకాశాల కన్నా తిరస్కరణలే ఎక్కువ. దీంతో నాకు నటన రాదేమో అనే అనుమానం కూడా వచ్చింది. నా కెరీర్‌లో పని లేకుండా ఉన్న రోజులే ఎక్కువ. ఒక్కోసారి జీవితంలో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళంగా ఉండేది అని తన ఎర్లీ డేస్‌ గుర్తు చేసుకుంది. అయితే తన జీవితంలో ఏర్పడిన గందరగోళాన్ని చాలా ఇష్టపడిందట త్రిప్తి. అప్పుడు తాను పడిన కష్టాలకు, అవమానాలకు ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పింది. వరుస అవకాశాల వల్ల ప్రస్తుతం నోటికి తిండి, కంటికి నిద్రకు కూడా సమయం ఉండటం లేదు అని ఆనందంగా చెప్పింది.

ఖలేజా దిలావర్ భార్య గుర్తుందా.. హీరోయిన్స్ కంటే ఘాటుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus