చిన్న సినిమాకి బాలయ్య భరోసా!!

స్వర్గీయ దాసరి నారాయణ రావు ఎప్పటికప్పుడు చిన్న సినిమాపై తన ప్రేమ చూపిస్తూనే వచ్చారు…చిన్న సినిమాకి కనీసం థియేటర్స్ దొరికే అవకాశం లేదని…అందువల్ల సినిమాలో కాంటెంట్ ఉన్న, ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు అని, అంతేకాకుండా బడా నిర్మాతల గుప్పెట్లో సినిమా హాళ్లు ఉండిపోవడం వల్ల, చిన్న సినిమాకి ఈ దుస్తితి పట్టింది అని ఆయన చెబుతూ తన ఆవేదనని వ్యక్తం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులను కొలిక్కి తెచ్చి, చిన్న సినిమాకు భరోసా ఇస్తాను అంటున్నాడు టాలీవుడ్ లెజెండ్, నటసింహం నందమూరి బాలకృష్ణ…విషయం ఏమిటి అంటే…

రీసెంట్ గా విజయవాడలో ఆంధప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్న సినిమా మేకర్స్ భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా బాలయ్య మాట్లాడారు…సినిమా – టీవీ రంగాల్లో నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చిన్న సినిమా వల్ల లోకల్ జనాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని బాలకృష్ణ తన అభిప్రాయం పంచుకున్నారు. ఇక అప్పట్లో చెన్నైలో ఉండే చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చే క్రమంలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అక్కడి నుంచి విజయ దశమినే తీసుకొచ్చామని.. ఇప్పుడు అదేరోజున ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం డెవపల్ మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభసూచకమని బాలకృష్ణ తెలిపారు…మొత్తంగా ఒక్కో అడుగు వేసుకుంటూ హైదరాబాద్ నుంచి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను బెజవాడకు తరలుస్తూ, చిన్న సినిమాకి అండగా నిలిస్తా అంటూ బాలయ్య చేస్తున్న ఈ పని నిజంగా హర్షించ దగ్గ విషయమే…మరి బాలయ్య పుణ్యమా అని చిన్న సినిమాకి మంచి రోజులు రావాలని…మనస్పూర్తిగా కోరుకుందాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus