Shaktimaan: పిల్లల సూపర్‌ హీరో కథతో బాలీవుడ్‌ భారీ ప్రయత్నం!

Ad not loaded.

సూపర్‌ హీరోస్‌ అంటే హాలీవుడ్‌లోనే ఉంటారు.. అని భారతీయలు అనుకుంటున్న సమయంలో టీవీల్లో ‘శక్తిమాన్‌’ వచ్చింది. ఆ రోజుల్లో ఈ సీరియల్‌ ఓ ప్రభంజనం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వారం వారం ఎంజాయ్‌ చేసేవారు. ఇప్పుడు ఈ కథ వెండితెరపైకి రాబోతోంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని టాక్‌. ఇందులో హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

90వ దశకంలో దేశాన్ని ఓ ఊపు ఊపేసిన సూపర్‌ హీరో ‘శక్తిమాన్‌’. ఈ పాత్ర సృష్టికర్త ముఖేష్‌ ఖన్నా. ఇప్పటికీ ఆయన ఎక్కడా కనిపించినా ఆ పేరుతోనే పిలుస్తారు అంటే ఆ పాత్ర పవర్‌ అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ టీవీ షో హక్కుల్ని సోనీ పిక్చర్స్‌ సొంతం చేసుకుంది. భీష్మ్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి ఫ్రాంఛైజీ ఈ సినిమాను నిర్మించనుంది.

ఇందులో హీరో పాత్ర కోసం రణ్‌వీర్‌ సింగ్‌తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. రణ్‌వీర్‌ ఇలాంటి పాత్రలు చేయాలంటే చాలా ఆసక్తి చూపిస్తుంటాడు. దీంతో అతనే సినీ ‘శక్తిమాన్‌’ అవ్వొచ్చు అని అంటున్నారు. నిజానికి ఐదు నెలల క్రితమే అంటే ఫిబ్రవరిలో తొలిసారి ‘శక్తిమాన్‌’ సినిమా గురించి వార్తలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆ వార్తలు వినిపిస్తన్నాయి. ఈసారి సినిమా ప్రారంభమవ్వడం పక్కా అని అంటున్నారు.

ఇక సీరియల్‌ గురించి చూస్తే ముఖేష్‌ ఖన్నానే తీర్చిదిద్దారు. దూరదర్శన్‌లో ఒక సీజన్‌గా ప్రసారమైంది. మొత్తంగా 520 ఎపిసోడ్‌లు టెలీకాస్ట్‌ చేశారు. ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 45 నిమిషాల నుండి గంట వరకు ఉండేది. సెప్టెంబరు 13, 1997 నుండి మార్చి 27, 2005 వరకు ఈ షో టెలీకాస్ట్‌ చేశారు. ఆ తర్వాత రెండో భాగం రాలేదు. దీని మీద ఒకటి రెండుసార్లు పుకార్లు వచ్చినా సీరియల్‌ రెండో పార్టు తెరకెక్కలేదు. ఇప్పుడు సినిమాగా వస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus