గతేడాది చివర్లో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనవసరమైన గొడవల కారణంగా రెండు నెలల ఆలస్యంగా విడుదలైన ‘పద్మావతి’ జరిగిన గొడవలు, రేగిన చిచ్చులతో సంబంధం లేకుండా మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాక ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చిన “పద్మావతి” చిత్రం ఇవాల్టిలో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పడుకొనే టైటిల్ పాత్ర పోషించగా.. రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. రాజ్ పుత్ మహారాజుల ధైర్యసాహసాలతోపాటు, రాజ్ పుత్ మహిళల గౌరవమర్యాదలను అత్యద్భుతంగా ప్రెజంట్ చేసిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంది.
డిసెంబర్ 1న విడుదల చేయాలని ప్రమోషన్స్ కూడా మొదలెట్టాక.. ఈ చిత్రంలో రాజ్ పూత్ లను తక్కువ చేసి చూపించారని, పద్మావతి పాత్ర పోషిస్తున్న దీపికా పదుకొణే మరియు ఖిల్జీ పాత్రలో పోషిస్తున్న రణవీర్ సింగ్ ల నడుమ రొమాన్స్ సీన్స్ ఉన్నాయని, అవి చరిత్రను నాశనం చేస్తాయని పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. దాంతో స్వయంగా సంజయ్ లీలా భన్సాలీ రంగంలోకి దిగి.. “అసలు రణవీర్-దీపికల నడుమ ఒక్క కాంబినేషన్ సీన్ కూడా లేదు, చరిత్రను ఏ విధంగానూ పక్కదోవ పట్టించలేదు, సినిమా చూసిన తర్వాత మీరే మెచ్చుకొంటారు” అంటూ ఓ వీడియోను యూట్యూబ్ లో వదిలాడు. అయినా సర్దుబాటు అవ్వని గొడవలు సినిమా రిలీజైన నెల తర్వాత “మమ్మల్ని కించపరిచే విధంగా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పడంతో కర్ణి సేన గొడవలు చేయడం ఆపింది.