మన దేశంలోని సినిమాలు ఇతర దేశాల్లో సైతం విడుదలవుతూ ప్రశంసలు పొందడంతో పాటు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. పాక్ నటుడు అలీ ఖాన్ తాజాగా ఒక సందర్భంలో అసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అలీ ఖాన్ మాట్లాడుతూ నా కెరీర్ భారత్ లోనే మొదలైందని ఇక్కడే నాకంటూ గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నానని ఆయన అన్నారు.
భారత్ లో ఫేమస్ కావడంతో పాక్ సినిమాలలో నటించే సమయంలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక ఇండస్ట్రీలలో పని చేసిన అనుభవం ఉందని అలీ ఖాన్ పేర్కొన్నారు. పాక్ ప్రజలు తమ సొంత వాళ్లను సులువుగా సపోర్ట్ చేయరని అలీ ఖాన్ కామెంట్లు చేశారు. అదే మేము భారత్ కు వచ్చి ఇక్కడ పేరు తెచ్చుకుంటే మాత్రం మాకు గౌరవ మర్యాదలు ఇస్తారని ఆయన వెల్లడించారు.
పాక్ , ఇండియన్ సినిమాల మధ్య బడ్జెట్ లెక్కలే తేడా అని అనుకుంటారని అలీ ఖాన్ పేర్కొన్నారు. అప్పట్లో బేజా ఫ్రై అనే సినిమా వచ్చిందని 50 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే రూ.10 కోట్లు వచ్చిందని ఆయన అన్నారు. పది కోట్ల రూపాయలతో సీక్వెల్ తీస్తే పెట్టిన డబ్బు అంతా పోయిందని అలీ ఖాన్ కామెంట్లు చేశారు. బడ్జెట్ ఒక్కటే ప్రధానమైన తేడా కాదని ఇక్కడఎవరూ సమయపాలన పాటించరని ఆయన పేర్కొన్నారు.
కమర్షియల్ షూటింగ్ కోసం ఎంతో ఖర్చు పెడతారని మనం సమయానికి అక్కడున్నా సరే యాడ్ షూట్ సాగుతూనే ఉంటుందని అలీ ఖాన్ వెల్లడించారు. చాలా ప్రాజెక్ట్ లు ఆలస్యంగా షూట్ పూర్తి చేసుకుంటాయని శిక్షణ పొందిన ఆర్టిస్టులు వచ్చేవరకు ఇది కొనసాగుతుందని అలీఖాన్ (Ali Khan) అన్నారు.