Pakka Commercial OTT: పక్కా కమర్షియల్ ఆ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుందా?

టాలీవుడ్ హీరో గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కి రిలీజవుతున్న సినిమా కావడంతో పక్కా కమర్షియల్ సినిమాకు రికార్డు స్థాయిలో థియేటర్లు దక్కుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.

పక్కా కమర్షియల్ డిజిటల్ హక్కులు కూడా ఆహా ఓటీటీ, నెట్ ఫ్లిక్స్ తీసుకున్నాయని తెలుస్తోంది. ఒకే సినిమాను రెండు ఓటీటీలలో రిలీజ్ చేయడం వల్ల ఎక్కువమంది ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశం ఉండటంతో పాటు ఓటీటీలకు తక్కువ మొత్తానికే డిజిటల్ హక్కులు లభించే ఛాన్స్ అయితే ఉంది. పక్కా కమర్షియల్ ఆలస్యంగానే ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తక్కువ టికెట్ రేట్లకే ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.

అటు గోపీచంద్ కు ఇటు మారుతికి కెరీర్ పరంగా ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా రిజల్ట్ పైనే ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఆధారపడి ఉందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ప్రభాస్ మారుతి కాంబో మూవీ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తాను ప్రభాస్ అభిమానులకు నచ్చే సినిమాను తెరకెక్కిస్తానని మారుతి కామెంట్లు చేశారు.

ఈ సినిమాకు రాజా డీలక్స్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. పక్కా కమర్షియల్ విడుదలైన తర్వాత ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus