బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం 15 వారాలపాటు ఎంతో విజయవంతంగా కొనసాగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి ఒక కామన్ మ్యాన్ కప్ అందుకోవటం విశేషం. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించారనే చెప్పాలి. మొదటి నుంచి కూడా తన అద్భుతమైన ఆట తీరని కనబరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ చివరికి టైటిల్ గెలిచారు.
ఇక టైటిల్ విన్నర్ గా నిలిచిన అనంతరం (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తాను బిగ్ బాస్ కార్యక్రమానికి రావడం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసానని తెలిపారు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నానని నేను బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టిలో పడటం కోసం ఎంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని ఈయన తెలియజేశారు. అయితే ఈ విషయాలన్నీ కూడా తన ఇంట్లో వారికి తెలియదని ప్రశాంత్ తెలిపారు.
ఇక తాను గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ మొత్తం రైతులకు ఇస్తానని గతంలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ విషయంలో తను వెనక్కి తగ్గేది లేదని ఆపదలో ఉన్నటువంటి రైతులకు తాను అండగా నిలుస్తానని, ఈ ప్రైజ్ మనీ మొత్తం రైతులకే ఇస్తాను అంటూ పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా ప్రైజ్ మనీతో పాటు ఈయన 15 వారాలు పాటు కొనసాగినందుకు రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు. దీనితోపాటు కారు కూడా అందించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ కారును తన తండ్రికి బహుమతిగా ఇస్తానని, జోయాలుకాస్ వారు అందించినటువంటి బంగారు ఆభరణాలను తన తల్లికి కానుకగా ఇస్తాను అంటూ పల్లవి ప్రశాంత్ తన ప్రైజ్ మనీ మొత్తం ఎవరెవరికి ఇస్తున్నారో ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.