బిగ్ బాస్ షో సీజన్7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన తర్వాత రెండు రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జైలు జీవితం అనుభవాలను పల్లవి ప్రశాంత్ పంచుకోగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జైలులో ఉన్న 48 గంటలు కష్టంగా గడిచాయని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు. ఆ సమయంలో నాకు ఆకలిగా కూడా అనిపించలేదని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. నేను సరిగ్గా తిండి కూడా తినలేదని తోటి ఖైదీలు భోజనం చేయాలని బలవంతం చేయడంతో చివరకు తిన్నానని పల్లవి ప్రశాంత్ అన్నారు.
జైలు భోజనం బాగానే ఉందని ఖైదీలు నన్ను అన్నా అన్నా అని పిలిచేవారని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు. నన్ను బిగ్ బాస్ షో గురించి అడిగేవారని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఎలాంటి నేరం, తప్పు చేయలేదని అయినప్పటికీ జైలు జీవితం గడపాల్సి వచ్చిందని ప్రశాంత్ పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో నేను పారిపోయానని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆ వార్తల్లో నిజం లేదని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.
లైఫ్ లో ఆస్పత్రికి, జైలుకు వెళ్లకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నాపై ఎవరైతే విమర్శలు, నెగిటివ్ కామెంట్లు చేశారో వాళ్లకు కూడా నేను అనుభవించిన పరిస్థితే ఎదురు కావచ్చని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని పేద రైతుల కోసం ఖర్చు చేస్తున్నారు.
నిజంగా కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి పల్లవి ప్రశాంత్ ప్రయత్నిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా అభిమానులకు ఎంతో దగ్గరయ్యారు. పాలిటిక్స్ పై దృష్టి పెడుతున్న పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లో భవిష్యత్తులో సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.